Friday, November 7, 2008

అందాల సీమ రాయలసీమ

కోటి రతనాల సీమ . . . నా రాయలసీమ
నిత్య సిరుల తల్లి . . . నా రాయలసీమ

పెక్కు నిధుల పెన్నా . . . నా రాయలసీమ
రణ వీరుల గడ్డ . . . నా రాయలసీమ

ప్రేయసి జ్ఞాపకం

మరచిపోలేని ఆ రూపం
నా కలలకు ఆధారం
చెరిగిపోని ఆ స్వప్నం
నా ప్రేయసి జ్ఞాపకం

కలల ప్రేయసి


కలల లోని ప్రేయసి
కదలి రావే ఊర్వసి
కవిని నేనై తపించి
కవిత నీవై వరించి

Thursday, November 6, 2008

స్పందించే హ్రుదయం

గుండె లొతుల్లొ ఎముందో ఎలా తెలుస్తుంది
తలుపు తట్టే ఆత్మీయత లభించేదాక . .
మండుటెండలో దాహం ఎలా తీరుతుంది
చల్లదనం అందించే మేఘం కురిసేదాక . .
ఈ కవితకు ప్రశంస ఎలా దొరుకుతుంది
స్పందించి చదివే హ్రుదయం దొరికేదాక . .

ప్రియురాలి హ్రుదయం

సాగరం ఎంత లోతుందో ఎవరికి తెలుసు
నేలను తాకే ముత్యపు చిప్పకు తప్ప
ప్రియురాలి హ్రుదయంలో ఏముందో ఎవరికి తెలుసు
ప్రేమ అంచుల్ని స్ప్రుశించే ప్రేమికునికి తప్పి

Wednesday, November 5, 2008

జన్మజన్మల వరం


జన్మలో వరం అడిగనో
ఎవరికోసం తపస్సు చేశానో
జన్మలో కోరని వరంగా
నీ స్నేహం దొరికింది ..నేస్తమా!

స్నేహం మరచిన ప్రాణం


ఓ నేస్తమా ..
నా కన్నులు నిన్ను మరచినా
నా హ్రుదయం నిన్ను మరువగలదా
నా హ్రుదయం నిన్ను మరచినా
నా ప్రాణం నిలువగలదా .. !

విశాలమైన స్నేహం

నేస్తమా .....నీ స్నేహంలో

విశాలమైన ప్రపంచం కూడా

ఎంతో చిన్నదిగా కనిపిస్తున్నది

ఓ నేస్తమా ..

నువ్వు లేని నా జీవితం

వెలుగు లేని దీపం వంటిది


ఓ నేస్తమా . . .

నా జీవితం వెలకట్టాల్సివస్తే

అది నీ స్నేహం మత్రమే అవుతుంది

స్నేహానికి అర్థం

ఓ నేస్తమా .. !
ఆద్యంతాలు
ఆశా నిరాశలు
ఒంటరితనం
ఓటమి లేనివే స్నేహమైతే
అలాంటి స్నేహానికి అర్థం "నువ్వు"

నువ్వు లేని నేను

నేస్తమా ..
నా ప్రతి శ్వాసా నువ్వైతే
నా గుండె చప్పుడు నువ్వైతే
నా కనుల వెలుగువు నువ్వైతే
నువ్వు లేని నేను . . . . . నేనేనా!

విరిసే పువ్వువి

ఓ ప్రియా ..!
విరిసే పువ్వువి నువ్వైతే
వీచే గాలిని నెనౌతా ..
మెరిసే తారవు నువ్వైతే
మోసే నింగిని నీనౌతా ..

సముద్రంలోని అలలా

సముద్రంలోని అలలా
నిదురలోని కలలా
కెరటంలాంటి స్వప్నం నీవు
కనిపించని రూపం నీవు ..!

అందని అందమా

ఊహలకందని రూపానివా .
వర్ణనకందని అందానివా ..
మనసుకందని భావానివా .
కనులకందని స్వప్నానివా ..

కవినైనా కాకపోతిని

లనైనా కాకపోతిని
కంటిపాపను సోకగా..
కవినైనా కాకపోతిని
కవితనై నిను చేరగా..

అభిమాన రాగమా

మనసు దోచిన మౌనమా..
మరపురాని కావ్యమా..
మదిలోని గేయమా..
నా అభిమాన రాగమా..

అందమైన హ్రుదయమా

నా మనసులో నిద్రిస్తున్న అందమా
నా ఎదుట నిలిచిన స్వప్నమా

నా కనులు కన్న కలల రూపమా
నా అనురాగ హ్రుదయమా......