Thursday, August 20, 2009

మాటల షికారు

పాలపుంతలో చుక్కల దారివెంట
తొలిమబ్బు పరదాలు తొలగించుకుంటూ
కాసేపలా మాటల షికారులోకి వెళితే!
ఆహా . . ఎంత బావుందీ భావన . .

మరువలేను ఓ నేస్తం

ఓ నేస్తమా . .
మనసుని మాటలుగా చేసి
భావాన్ని అక్షరాలుగా రాసి
నిన్ను నేను మరచిపోవలంటే
నన్ను నేను మరచిపోవాలి
నన్ను నేను మరచిపోవాలంటే . . !

మరచిపోలేని ఙాపకాలుగా

అందమైన ఆ క్షణాలు
అందుకోలేని దూరాలుగా
మరచిపోలేని ఙాపకాలుగా
మనమాడిన ఆటలు ముద్దుగా
మనం చేసిన అల్లరి సద్దుగా
నిజం చెబుతున్నా ఆ దేవుడి సాక్షిగా
ఓ నేస్తం . . తిరిగిరాదు ఈ సమస్తం
అందుకే అందుకో ఈ హస్తం
కడదాకా కాదు . . మరుజన్మదాకా కాదు . .

దూరమౌతున్న నేస్తమా!

మన స్నేహానికి శ్రీకారం చుట్టి
గత జన్మకు సాక్షివై . .
వీడని ఙాపకాల కర్తవై
కాలం ఒడిలో దూరమౌతున్నావా . . నేస్తమా!

తొలిరేయి .. మొహమాటం

జడలోని మల్లెలకు మొహమాటం
గదిలోని అగరొత్తులకు ఉబలాటం
మదిలోని ఊసులకు పితలాటకం
అంతా జగన్నాటకం .. హేరాం!!

సిగ్గుపడిన మల్లెతీగ

పున్నమి రాతిరి వెన్నెలలో. .
చందమామ తొంగిచూడగా. .
మల్లెతీగకు ఎంత సిగ్గో . .
పూలకొంగు మొహాన కప్పుకుంది!

రాధ . . . కృష్ణ

వెన్నెల వరదలై పారుతుంటే
విరజాజులు వింతగా చూస్తుంటే
వంశీకృష్ణుని విరహ గానాలు
రాధ మదిని చేరేనా!!