Friday, October 2, 2009

' అమ్మ ' - అనుబంధం

తడబడుతూ పడే తొలి అడుగులోను
పయనిస్తూ సాగే ప్రతి అడుగులోను
ఆరాట పడుతూ అనుబంధం పంచే
ఆ బంధం పేరు ' అమ్మ '

మరో జన్మ అమ్మగా

అమ్మంటే తెలపడానికి భాష చాలడం లేదు
కాని చెప్పడానికి ఆశ ఆగడం లేదు
మరో జన్మంటూ ఉంటే నీకు అమ్మగా పుట్టాలని ఉంది

Thursday, August 20, 2009

మాటల షికారు

పాలపుంతలో చుక్కల దారివెంట
తొలిమబ్బు పరదాలు తొలగించుకుంటూ
కాసేపలా మాటల షికారులోకి వెళితే!
ఆహా . . ఎంత బావుందీ భావన . .

మరువలేను ఓ నేస్తం

ఓ నేస్తమా . .
మనసుని మాటలుగా చేసి
భావాన్ని అక్షరాలుగా రాసి
నిన్ను నేను మరచిపోవలంటే
నన్ను నేను మరచిపోవాలి
నన్ను నేను మరచిపోవాలంటే . . !

మరచిపోలేని ఙాపకాలుగా

అందమైన ఆ క్షణాలు
అందుకోలేని దూరాలుగా
మరచిపోలేని ఙాపకాలుగా
మనమాడిన ఆటలు ముద్దుగా
మనం చేసిన అల్లరి సద్దుగా
నిజం చెబుతున్నా ఆ దేవుడి సాక్షిగా
ఓ నేస్తం . . తిరిగిరాదు ఈ సమస్తం
అందుకే అందుకో ఈ హస్తం
కడదాకా కాదు . . మరుజన్మదాకా కాదు . .

దూరమౌతున్న నేస్తమా!

మన స్నేహానికి శ్రీకారం చుట్టి
గత జన్మకు సాక్షివై . .
వీడని ఙాపకాల కర్తవై
కాలం ఒడిలో దూరమౌతున్నావా . . నేస్తమా!

తొలిరేయి .. మొహమాటం

జడలోని మల్లెలకు మొహమాటం
గదిలోని అగరొత్తులకు ఉబలాటం
మదిలోని ఊసులకు పితలాటకం
అంతా జగన్నాటకం .. హేరాం!!

సిగ్గుపడిన మల్లెతీగ

పున్నమి రాతిరి వెన్నెలలో. .
చందమామ తొంగిచూడగా. .
మల్లెతీగకు ఎంత సిగ్గో . .
పూలకొంగు మొహాన కప్పుకుంది!

రాధ . . . కృష్ణ

వెన్నెల వరదలై పారుతుంటే
విరజాజులు వింతగా చూస్తుంటే
వంశీకృష్ణుని విరహ గానాలు
రాధ మదిని చేరేనా!!

Tuesday, June 30, 2009

మా ఇంటి ముందు అరుగు

మా ఇంటి ముందు అరుగు
అయింది మా కబుర్లకు నెలవు
. . . . . . . . వేసవి కాలపు సెలవుల్లో
. . . . . . . . సాయంకాలపు సమయంలో
ఎదురింటి రాధ ఎదురుచూపులు
మధు గాడి ఉరుకుల పరుగులు
. . . . . . . . పక్కింటి మేడ మీది ప్రియాంక
. . . . . . . . పడుతోంది శీను గాడి వెనుక
దూరంగా వస్తున్న దివ్యను చూసి
దయ చూపమంటున్న రవిగాడు
. . . . . . . . మా ఇంటి ముందు అరుగు
. . . . . . . . అయింది మా ప్రేమలకు పిలుపు
మొదలయ్యాయి కళాశాల చదువులు
తొడిగాయి పరిచయాల కుసుమాలు
. . . . . . . . . వచ్చాయి దసరా సెలవులు
. . . . . . . . . విరిసాయి ప్రేమల పూవులు
జరిగాయి సంక్రాంతి సంబరాలు
పెరిగాయి మదిలోని సరదాలు
. . . . . . . . తెచ్చాయి ఆఖరి పరీక్షలు
. . . . . . . . మిగిలాయి శూన్యపు ఫలితాలు
మా ఇంటి ముందు అరుగు
అయింది మా చదువులకు సెలవు


ఇవండీ మా స్నేహితుల సరదా కబుర్లు .. మరి మీవి ...!!

తారలు ... భామలు

నింగిలోని తారలు ... నేల మీది భామలు
అందనివి ... అందమైనవి
కడలిలోని కెరటాలు ... చిరునవ్వుల పెదాలు
ఆగనివి ... అంతులేనివి
అగ్నిలోని శిఖలు ... నీలాలు గారు కనులు
ఆరనివి ... ఆకర్షించేవి

Friday, January 23, 2009

మాయ.. మాయ.. మాయ

మాయ లేడిలా వున్నావు..
ఏదొ మాయ నను చేశావు..
ముద్దు ముద్డుగా వున్నావు..
మనసునంత దోచేశావు ..

మనసంతా నువ్వే నిండి ..
మైకంలా కమ్మేసావు..
మదిలో నీ రూపంతోనె ..
మతిపొగొట్టేస్తున్నావు ..